Thursday, 29 February 2024

మార్కండేయ స్వామి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం

 



నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మార్కండేయ మందిరంలో గురువారం శ్రీ భక్త మార్కండేయ విగ్రహము రాజగోపుర ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా భక్తుశ్రద్ధలతో జరిగాయి ఐదు రోజులుగా ప్రతిష్టాపన ఉత్సవాలు జరుగుతుండగా చివరి రోజు గురువారం హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి కరకమలములచే మార్కండేయ ప్రాణ ప్రతిష్ట జరిపారు ఈ సందర్భంగా తెల్లవారుజామునుంచే ద్రొక్కుబలి దిగ్బలి హరణము నేత్రోన్ మిలీనము మహా పూర్ణాహుతి కుంభ సంప్రోక్షణ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి శాంతి కళ్యాణము కార్యక్రమాలు నిర్వహించారు  శతాధి ప్రతిష్టాపన చార్యులు చౌటుపల్లి గంగా ప్రసాద్ దీక్షితులు పౌరోహిత్యంలో జరిగిన పార్వతి రాజరాజేశ్వర స్వామి శాంతి కల్యాణంలో మంగి రాములు మహారాజు ఇప్పకాయల హరిదాసు స్వామి పాలకొండ మాజీ ఎమ్మెల్యే ఇరవత్రి అనిల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి తో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని కళ్యాణాన్ని వీక్షించారు మాజీ ఎమ్మెల్యే బేగాల గణేష్ గుప్తా మేయర్ దండు నీతో కిరణ్ తదితర ప్రముఖులు మార్కండేయ స్వామిని దర్శించుకుని పూజలు చేశారు నగర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వేలాదిగా తరలివచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుజ్జేటి వెంకట నరసయ్య జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు బిర్జు దత్తాత్రేయ వర్కింగ్ ప్రెసిడెంట్ పులగం హనుమాన్లు మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గుజరాజేశ్వరి నగర పద్మశాలి సంఘం బాధ్యులు గంట్యాల వెంకట నరసయ్య దాసరి కొండయ్య కారం కొండ విట్టల్ దేంగి మోహన్ మందిర కమిటీ చైర్మన్ లక్కవత్రి దేవదాస్ రాపల్లి గురుచరణ్ ఏజీ రామస్వామి గుడ్ల భూమేశ్వర్ బల్ల లక్ష్మీబాయి కొండ గంగా చరణ్ చింతల గంగాధర్ బీమార్తి సురేందర్ పెంటిరాజు బుస శ్రీనివాస్ జై సత్యపాల్ తుమ్మ నాగభూషణం సుభాష్ మహేష్ సత్య ప్రకాష్ సిర్పరాజు రాజు తదితరులు పాల్గొన్నారు


No comments:

Post a Comment