26, ఫిబ్రవరి 2024, సోమవారం

భిక్ నూర్ లో కొన సాగుతున్న ఎల్లమ్మ జాతర

భిక్నూర్ మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ జాతర కొనసాగుతోంది. రెండవ రోజు ఉదయం అమ్మ వారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కుంకుమార్చన , సాయంత్రం ఆలయం చుట్టు డప్పు వాయిద్యాల నడుమ ఎడ్ల బండ్లు ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా పోత రాజుల విన్యాసాలు ఆకట్టు కున్నాయి. ఎడ్ల బండ్లు ఊరేగింపు సందర్భంగా భక్తులు కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా జాగ్రత్త లు గౌడ సంఘం ప్రతినిధులు తీసు కున్నారు. ఈ కార్య క్రమం లో గౌడ సంఘం ప్రతినిధులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మైసమ్మ ఆలయంలో పూజలు

 నసురుల్లాబాద్ మండలం మైలారం గ్రామ శివారులో ఉన్న మైసమ్మ ఆలయంలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలో వనభోజనాలు చేశారు ఆల ప్రాంగణంలో జాతర కొనసాగింది