26, ఫిబ్రవరి 2024, సోమవారం

కొలిప్యక్ లో లక్ష్మీ నరసింహ స్వామి నాగ వెల్లి, చక్ర తీర్థం.

 కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి రోటరీ క్లబ్లో 49వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు పోలబోయిన సత్యం మాట్లాడుతూ గతంలో పనిచేసిన అధ్యక్షులు శక్తి వంచన లేకుండా సామాజిక కార్యక్రమాలలో సేవలు చేసినందుకు క్లబ్ స్థిరంగా పటిష్టంగా ఉందని అన్నారు అనంతరం పూర్వ అధ్యక్షులను సన్మానించారు ఐదుగురు విద్యార్థులకు సైకిల్ అందజేశారు కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి రాజనర్సింహారెడ్డి ప్రతినిధులు శ్రీశైలం కాశీనాథం ధనుంజయ ట్రాక్టర్ విజయ్ కుమార్ డాక్టర్ బాలరాజు చంద్రశేఖర్ వెంకటరమణ కృష్ణమూర్తి కాశీనాథరావు అంజయ్య హరిస్మరణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

నేడు స్వర్ణ ఖడ్గ బహుకరణ

 నిజామాబాద్ నగరంలోని అయ్యప్ప మందిరంలో గల అయ్యప్ప స్వామికి సోమవారం జగన్ గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి చేతుల మీదుగా స్వర్ణ ఖడ్గ బహుకరణ నిర్వహించనున్నట్లు ఇందూరు అయ్యప్ప మందిరం అధ్యక్షుడు గడ్డం భక్తవత్సలం తెలిపారు ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరవుతారని హిందువుల అయ్యప్ప మందిరం ప్రతినిధులు తెలిపారు మధ్యాహ్నం అన్న ప్రసాదన కార్యక్రమం ఉంటుందని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.