మద్నూర్ మండలం కేంద్రం లోని సంతోషి మాతా ఆలయం లో శుక్ర వారం మార్చి ఒకటి నాడు ఆలయ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకురాలు సంతోషి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వేడుక ను విజయవంతం చేయాలని కోరారు. ధ్వజా రోహణం, కుంకుమార్చన,అభిషేకం ,యజ్ఞం,హారతి కార్య క్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
26, ఫిబ్రవరి 2024, సోమవారం
అర్గుల్ లో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర ఉత్సవాలు.
జక్రాన్ పల్లి మండలం లోని ఆర్గుల్ గ్రామం లో ఆదివారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం స్వామి వారి కి అభి షేకం, దీపా రాధన , తీర్థ ప్రసాదం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమ వారం యజ్ఞం అగ్ని ప్రతిష్ట, బలి హరణం, తీర్థ ప్రసాదం వితరణ , ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.27 న స్వామి వారి కళ్యాణ మహోత్సవం,28 న సామూహిక కుంకుమార్చనలు, దొంగల దోపు కార్య క్రమం జరగనుంది.29 న జాతర, రథోత్సవం, మార్చ్ 1 న చక్ర తీర్థం,2 న స్వామి వారి నాగ వెల్లి, చక్ర స్నానం, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు మొక్కలు చెల్లించుకున్నారు. వేద పండితులు ఆచార్య తేజ చక్రవర్తుల ఆధ్వర్యం లో జాతర ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.