జక్రాన్ పల్లి మండలం లోని ఆర్గుల్ గ్రామం లో ఆదివారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం స్వామి వారి కి అభి షేకం, దీపా రాధన , తీర్థ ప్రసాదం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమ వారం యజ్ఞం అగ్ని ప్రతిష్ట, బలి హరణం, తీర్థ ప్రసాదం వితరణ , ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.27 న స్వామి వారి కళ్యాణ మహోత్సవం,28 న సామూహిక కుంకుమార్చనలు, దొంగల దోపు కార్య క్రమం జరగనుంది.29 న జాతర, రథోత్సవం, మార్చ్ 1 న చక్ర తీర్థం,2 న స్వామి వారి నాగ వెల్లి, చక్ర స్నానం, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు మొక్కలు చెల్లించుకున్నారు. వేద పండితులు ఆచార్య తేజ చక్రవర్తుల ఆధ్వర్యం లో జాతర ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.
No comments:
Post a Comment