18, మార్చి 2024, సోమవారం

ముగిసిన ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం

 కమలేష్ పటేల్ కు ప్రపంచశాంతి రాయబారి పురస్కారం కమలేష్ ద్వారా ఆధ్యాత్మిక ఉద్యమం మరింత ప్రకాశించాలి జగదీబ్ ధనికడ్ మహోత్సవంలో పాల్గొన్న వందకు పైగా దేశాల యోగా అభ్యాసకులు

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో నాలుగు రోజులపాటు నిర్వహించిన ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం ఆదివారం తో ముగిసింది ఈ సందర్భంగా కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ జనరల్ సెక్రెటరీ బ్యాటరీ షియా ఈ మహోత్సవ నిర్వాహకుడు కమలేష్ డి పటేల్ కు ప్రపంచ శాంతి రాయబారి పురస్కారాన్ని ఉపరాష్ట్రపతి ఘనకాడ చేతుల మీదుగా అందజేశారు శాంతి మార్గాన్ని అన్వేషించాలని సంకల్పించడం అందులో దేశవ్యాప్తంగా అన్ని కులాలు మతాల వారిని ఒకే వేదిక పైకి తీసుకురావడం అభినందనీయమని ధనకాడ అన్నారు కమలేష్ ద్వారా ఆధ్యాత్మిక శాంతి ఉద్యమం మరింత ప్రకాశించాలని 160 దేశాలలోని జీవితాలను తాకిన ఈ ఉద్యమం తప్పనిసరిగా అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు కాగా ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవంలో 100కు పైగా దేశాలకు చెందిన వేలాదిమంది యోగ అభ్యాసకులు దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన లక్షకు పైగా ప్రజలు కులమతాలకు అతీతంగా పాల్గొన్నారు ఈ నెల 15న రాష్ట్రపతి ద్రౌపది 16 17 వ తేదీలలో ఉపరాష్ట్రపతి ఘనకాడ మహోత్సవంలో పాల్గొని పలు సూచనలు చేశారు అలాగే కేంద్ర రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు దేశ రాష్ట్ర ఉన్నతాధికారులు వివిధ మతాలకు చెందిన ఆధ్యాత్మికవేత్తలు విద్యార్థులు హాజరయ్యారు మహోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక ప్రదర్శనలు ధ్యానం యోగ సాధన వంటి కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి



రామప్ప ఆలయ శిల్పకళ అద్భుతం

 యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని ఆదివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక ఆరాధి దంపతులు సందర్శించారు వీరితోపాటు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ టి వినోద్ కుమార్ జస్టిస్ కే లక్ష్మణ్ జస్టిస్ అండ్ రాజేశ్వరరావు ఉన్నారు వీరందరికీ ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు రామలింగేశ్వర స్వామికి జస్టిస్ ఆరాధ్య దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రధాన న్యాయమూర్తి దంపతులను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ ఈవో బిల్ల శ్రీనివాస్ ఘనంగా సన్మానించి ఆలయ చిత్రపటాన్ని బహూకరించారు అనంతరం టూరిజం గైడ్లు ఆలయ చరిత్రను శిల్పకళా సంపదను గురించి న్యాయమూర్తులకు వివరించారు ఆలయ శిల్పకళా అద్భుతం అని సందర్శకుల పుస్తకంలో జస్టిస్ అలోక రాజ స్వయంగా రాశారు హైకోర్టు రిజిస్టార్లు నందికొండ నరసింహారావు ప్రవీణ్ కుమార్ శ్రీనివాస్ రెడ్డి ములుగు జిల్లా జడ్జి పీవీ లలితా శివజ్యోతి జడ్జిలు మాధవి రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు