కమలేష్ పటేల్ కు ప్రపంచశాంతి రాయబారి పురస్కారం కమలేష్ ద్వారా ఆధ్యాత్మిక ఉద్యమం మరింత ప్రకాశించాలి జగదీబ్ ధనికడ్ మహోత్సవంలో పాల్గొన్న వందకు పైగా దేశాల యోగా అభ్యాసకులు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో నాలుగు రోజులపాటు నిర్వహించిన ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం ఆదివారం తో ముగిసింది ఈ సందర్భంగా కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ జనరల్ సెక్రెటరీ బ్యాటరీ షియా ఈ మహోత్సవ నిర్వాహకుడు కమలేష్ డి పటేల్ కు ప్రపంచ శాంతి రాయబారి పురస్కారాన్ని ఉపరాష్ట్రపతి ఘనకాడ చేతుల మీదుగా అందజేశారు శాంతి మార్గాన్ని అన్వేషించాలని సంకల్పించడం అందులో దేశవ్యాప్తంగా అన్ని కులాలు మతాల వారిని ఒకే వేదిక పైకి తీసుకురావడం అభినందనీయమని ధనకాడ అన్నారు కమలేష్ ద్వారా ఆధ్యాత్మిక శాంతి ఉద్యమం మరింత ప్రకాశించాలని 160 దేశాలలోని జీవితాలను తాకిన ఈ ఉద్యమం తప్పనిసరిగా అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు కాగా ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవంలో 100కు పైగా దేశాలకు చెందిన వేలాదిమంది యోగ అభ్యాసకులు దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన లక్షకు పైగా ప్రజలు కులమతాలకు అతీతంగా పాల్గొన్నారు ఈ నెల 15న రాష్ట్రపతి ద్రౌపది 16 17 వ తేదీలలో ఉపరాష్ట్రపతి ఘనకాడ మహోత్సవంలో పాల్గొని పలు సూచనలు చేశారు అలాగే కేంద్ర రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు దేశ రాష్ట్ర ఉన్నతాధికారులు వివిధ మతాలకు చెందిన ఆధ్యాత్మికవేత్తలు విద్యార్థులు హాజరయ్యారు మహోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక ప్రదర్శనలు ధ్యానం యోగ సాధన వంటి కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి
No comments:
Post a Comment