ముగిసిన విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు..
ఆత్మకూరులో మూడు రోజులగా కొనసాగుతున్న మరకత లింగేశ్వర స్వామి విగ్రహ పతిష్టాపన ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి ఉత్సవాలలో భాగంగా ఆఖరి రోజు పేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆలయంలో మరకత లింగాన్ని ప్రతిష్టించారు దీనితో పాటు ఆలయంలో యంత్ర ప్రతిష్ట మూర్తి ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట తదితర కార్యక్రమాలను నిర్వహించారు కాక ఆలయం వద్ద జరిగిన విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలకు మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్ టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్ తో పాటు మండల కాంగ్రెస్ నాయకులు వేరువేరుగా హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు.
వైభవంగా కోటి కుంకుమార్చన..
నవీపేట మండలంలోని బినోల గ్రామంలో శుక్రవారం సామూహిక కోటి కుంకుమార్చన వైభవంగా నిర్వహించారు పురోహితుడు కృష్ణ ప్రసాద్ జోషి ఆధ్వర్యంలో భువనేశ్వరి మాత ఆలయ ప్రాంగణంలో ఈ కోటి కుంకుమార్చన చేపట్టారు ఇప్పటివరకు 42 శుక్రవారం చేపట్టగా ఈనెల 22న జరిగే పూర్ణాహుతితో ముగుస్తుందని పేర్కొన్నారు కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి మహిళలు పాల్గొన్నారు.
సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు..
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్డలూరు గ్రామ శివారులో గల నిలిచిపూర్ శ్రీ సరస్వతి దేవి ఆలయంలో అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు శుక్రవారం అమ్మవారికి పర్వదినం కావడంతో ఉదయం నుంచి భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో చేరుకున్నారు ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి కుంకుమార్చనలు హారతి అక్షరాభ్యాసం వంటి పూజా కార్యక్రమాలను అంగరంగ వైభవంగా చేపట్టారు అనంతరం భక్తులు అమ్మవారికి మొక్కుల తీర్చుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు
ఆలయానికి వచ్చే భక్తులకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలను ఆలయ ధర్మకర్త కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పార్సి విఠల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.




కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి