1, ఆగస్టు 2018, బుధవారం

సకల విద్యల సారం సంస్కారం - కవిత

సకల విద్యల సారం సంస్కారం ,
ఇది లేని జీవితం అగును నిస్సారం ,
సరిగా పాటిస్తే పొందెదము సత్కారం ,
లేకపొతే అనుభవమగును చీత్కారం ,
పెట్టెదరు జనం ఓ పెద్ద నమస్కారం ,
పాడైపోవును మన గ్రహ చారం ,
సంస్కారం పట్లనే మనం పెంచుకోవాలి మమకారం ,
పాటిస్తే దీనిని ఒక పద్ధతి ప్రకారం ,
అందును అన్ని వైపుల నుండి మనకు సహ కారం ,
పొందును సకల సమస్యలు పరిష్కారం ,
అగును జీవిత కలలు సాకారం ,
తొలగిపోవును జీవితం లోని అంధకారం ,
అనుభవమగును మధుర జీవన సారం.

సేవా భావం ఒక అమూల్యమైన ఆభరణం - కవిత

సేవా భావం ఒక అమూల్యమైన ఆభరణం,
ధరించాలి నిరంతరం దీనిని మనం,
తపించాలి దీనికై అనుక్షణం మనం,
వెచ్చించ్చాలి సమయం దీనికై అనుదినం,
సాధించాలి దీనిలో పరిణతి దినదినం,
తరించాలి సేవలో ప్రతి క్షణం,
లీనమవ్వాలి దీనిలో ప్రతి దేహకణం,
తగ్గించాలి సేవతో ఆందోళన ఇతరులలో మనం,
పెంపొందించాలి ఇతరులలో సేవా గుణం,
పంచుకోవాలి ఆ ఆనందం ఇతరులతో మనం,
పెంచాలి సేవతో ఇతరులలో మంచి తనం,
గ్రహించాలి ఇతరులలోని మంచిని మనం,
చిందించాలి సేవలో స్వేదం జనం
అనుగ్రహించాలి బాలలను సేవతో మనం,
నేర్పించాలి భావితరాలకు ఈ సుగుణం
గర్వించాలి భావితరాలు చేసుకొని మనల్ని మననం