24, మే 2021, సోమవారం

గుమ్మాలకు తోరణాలు ఎందుకు కట్టాలి

 ఇంటి గుమ్మాలకు తోరణాలు కట్టకుండా శుభ కార్యాలు పండగలు నిర్వహించరు. మామిడి రావి జువ్వి మర్రి ఉత్తరేణి ఆకులను పంచపల్లవాలు అంటారు. శుభకార్యాలలో వీటిని విరివిగా వాడతారు .తోరణాలుగా మాత్రం మామిడి ఆకులను మాత్రమే వినియోగిస్తారు. మామిడి నిద్రలేమిని పోగొడుతుంది పండుగల వేళ పని ఒత్తిడిని శ్రమను పోగొట్టేది మామిడాకు తోరణం. మామిడి కోరికలనూ తీరుస్తుందని భావిస్తారు .పర్వదినాలలో యజ్ఞ యాగాలలో ధ్వజారోహణం చేయడం ఆచారం .దానికి ప్రతీకగా తోరణాలు కట్టి ఆచారం వచ్చింది.

గృహప్రవేశం లో పాలు ఎందుకు పొంగిస్తారు?

పాలు పొ0గి న ఇల్లు శ్రీలు పొంగిన ఇల్లు అవుతుందని మన వారి  నమ్మకం. పాలు పొంగిన ఇంట్లో  అష్ట ఐశ్వర్యాలు ,భోగభాగ్యాలు విలసిల్లు తాయి .కొత్త ఇంటిలోకి ముందుగా గోవు ను ప్రవేశపెట్టి తర్వాత క యజమాని ప్రవేశిస్తాడు .గోవు మహాలక్ష్మి తిరిగిన ఇంటిలో దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. ఇంటి ఆడపడుచు లను పిలిచి గృహప్రవేశ సమయంలో ముందుగా పొయ్యి వెలిగించి పాలు పొంగిస్తారు. ఆ పాలతో పరమాన్నం వండి వాస్తు పురుషుని కి నైవేద్యం పెడతారు. దీనితో ఆ ఇంట్లో సుఖశాంతులకు సంపదలకు కొదవ ఉండదని నమ్మకం .అందుకే కొత్త ఇంట్లో పాలు పొంగిస్తారు.