దర్భలు ఎప్పుడూ పవిత్రమైనవే. దర్భను తాకకూడదు అని చెప్పే సందర్భం ఒక్కటీ లేదు. అశుచి నుంచి మనల్ని బయటపడేసేది దర్భయే. ఇంటిలో ఏదైనా పెద్ద శుభకార్యం చేసిన కొద్ది కాలానికే పెద్దలకు సంవత్సరీకాలు , త ద్ది నా లు పెట్టుకోవలసి వస్తే నువ్వులు తాకక పోవడం మాత్రం కనిపిస్తుంది .నువ్వుల కు బదులుగా వాడేవి ఏ వీ సరైన ప్రత్యామ్నాయాలు కావు . పితృకార్యం చేయవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా నువ్వుల నేఉపయోగించాలి .అందులోనూ తల్లిదండ్రులకు శ్రాద్ధకర్మలు నిర్వహించవలసి వచ్చినప్పుడు అస్సలు మానేయకూడదు.
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
24, మే 2021, సోమవారం
గుడిలోనికి వెళ్లేముందు గడపకు ఎందుకు నమస్కరిస్తారు?
గుడిలోనికి మాత్రమే కాదు ఇక్కడ గడప ఉన్నా నమస్కరించిన తరువాతే లోనికి వెళ్ళాలి .లక్ష్మీ దేవి గా భావిస్తాము. అందుకే రోజు గడపన కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి నమస్కరిస్తాము. దేహ లీ దేహ పర్యంత స్థాన సంపర్క శోభితే మత్కర్మ పరి పూర్ణయ యతో భవే సదా మమ అనే మంత్రాన్ని చెబుతూ గడపకు నమస్కరించాలి .నేను ఆచరించిన కర్మలు పరిపూర్ణంగా సఫలం చేసుకోవడానికి కావలసిన సంస్కారాన్ని ప్రసాదించు తల్లి, నన్ను మంచివాడిగా చేయమని ఈ శ్లోకానికి అర్థం. మంచివాడిగా ఉంటే సమాజం తద్వారా దేశం ఉత్తమంగా తయారవుతాయి .సంస్కారాన్ని మనకు నేర్పేది గడప రూపంలోని లక్ష్మీదేవి .అందుకే గడపకు నమస్కరించాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)