24, మే 2023, బుధవారం

వాసవీ మాతకు ఘనంగా పూజలు

 23-5-2023,జంగం పల్లి,భిక్ నూర్ మండలం.

వాసవీ మాత పీఠం జంగంపల్లి గ్రామానికి వచ్చిన సందర్భంగా , భికనుర్ మండలం లోని జంగంప ల్లి గ్రామ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యక పూజలు నిర్వహించారు. అమ్మ వారి కి ఓడి బియ్యం, కట్న కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా వాసవి మాత చాలీసా ను సామూహిక పారాయణం చేశారు. ఈ కార్య క్రమంలో ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు కె.శంకర్, ప్రధాన కార్యదర్శి నాగరాజు , మాజీ సర్పంచ్ సిద్ధ రాములు, వాసవీ క్లబ్ రీజియన్ చైర్మన్ గందే శ్రీనివాస్,,ప్రతినిధులు కొత్త సిద్ధరాములు,వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.



15, జూన్ 2022, బుధవారం

అన్న దాన మహిమ

అన్నదానం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలిపే అద్భుతమైన కథ ఇది. అన్నదాన ప్రాశస్త్యం గురించి తెలిపే కథలు కోకొల్లలు.  వాటి గురించి తెలుసుకుంటూ ,పాటిస్తూ ,ఆధ్యాత్మిక పురోగతి సాధించాలని కోరుకుంటూ...