31, జనవరి 2024, బుధవారం

నదీ తీరం జనహారం

 తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని పెన్ గంగా తీరం జనహారాన్ని తలపిస్తోంది పెనుగంగా జాతరలో భాగంగా మహారాష్ట్రతో పాటు ఆదిలాబాద్ జిల్లా జైనథ్ బేల మండలాల్లోని చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు నదికి ఇరువైపులా ఇటు తెలంగాణ అట మహారాష్ట్ర పుణ్యస్నానాలు ఆచరించి నదీమ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు నైవేద్యాలు సమర్పించి ముగ్గురు తీర్చుకున్నారు దీంతో ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతమైన దల్లారా వద్ద నది తీరం ఎటు చూసినా ఇలా భక్తజన సందడిగా దర్శనమిచ్చింది.



30, జనవరి 2024, మంగళవారం

శ్రీ సీతారామచంద్ర స్వామికి ప్రత్యేక పూజలు

 బాన్సువాడ పట్టణంలోని శ్రీరామ కాలనీలో గల శ్రీరామ ఆలయంలో అర్చకులు మధుసూదన శర్మ శ్రీ సీతారామచంద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం స్వామివారికి అభిషేకాలు అర్చనలు చేపట్టారు భక్తులు సమర్పించిన నూతన వస్త్రాలతో అలంకరించారు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులున్నార