31, జనవరి 2024, బుధవారం

మూడు నుంచి తిరుమలలో ధార్మిక సదస్సు

 మూడు నుంచి తిరుమలలో ధార్మిక సదస్సు

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో భక్తుల్లో ఆధ్యాత్మిక భావవ్యప్తి కోసమే తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు ధార్మిక సదస్సు నిర్వహించనున్నట్లు టిటిడి ధర్మకర్తల మండల అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు ధార్మిక సదస్సు ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మరింతగా హైందవ ధర్మాన్ని శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేసేందుకు చిన్న వయసు నుంచే చిన్నారుల్లో మానవతా విలువలను పెంచేందుకు టీటీడీ అనేక చర్యలు చేపడుతోందని తెలిపారు దీనిలో భాగంగా ధార్మిక సదస్సు నిర్వహించి పీఠాధిపతులు మఠాధిపతుల సూచనలను స్వీకరించి మరింతగా ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు ఇప్పటివరకు 57 మంది పీఠాధిపతులు సదస్సుకు వచ్చేందుకు సమ్మతించినట్లు చెప్పారు శ్రీవారి ఆలయం నుంచి ఏ సందేశం వెళ్లిన భక్తులందరూ ఆమోదించి ఆచరిస్తారని చైర్మన్ తెలిపారు.





మహానుభావుడు పరిషత్ బైక్ ర్యాలీకి ఘన స్వాగతం

 అఖిల భారతీయ మహానుభావు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు మహంతి మచ్చాలే బాబా మహారాష్ట్ర బైక్ ర్యాలీకి బుధవారం స్థానిక భక్తులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం కామారెడ్డి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి శ్రీకృష్ణ ధ్యాన మందిరం కు వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో మహానుభావుడు పరిషత్ ప్రతినిధులు జయసాయి దేవ్ శ్యాంశాస్త్రి రమేష్ శాస్త్రి దినేష్ దాదా అమృత శాస్త్రి ధర్మరాజు కిరణ్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు