2, ఫిబ్రవరి 2024, శుక్రవారం

శబరిమాత ఆశ్రమంలో పల్లకి సేవ

 తాడ్వాయి మండల కేంద్రంలోని శబరిమాత ఆశ్రమంలో శుక్రవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు శబరిమాత ప్రతిమ దివ్య సమాధి పాదుకలను పువ్వులతో అలంకరించారు అనంతరం పల్లకి సేవ నిర్వహించారు అన్నదానం చేశారు.



చుక్కాపూర్ లో సుదర్శన హోమం

 స్వాతి నక్షత్రం సందర్భంగా శుక్రవారం మండలంలోని చుక్కాపూర్ గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సుదర్శన నరసింహ హోమం నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కమలాకర్ రెడ్డి ఈవో శ్రీధర్ రావు జూనియర్ అసిస్టెంట్లు అర్చకులు ఆలయ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.