మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు తమ తల్లిదండ్రులని ఆ కుమారులు అలా భావించడమే కాదు వారికి ఆలయం కూడా నిర్మించారు అందులో వారి విగ్రహాలు నెలకొల్పి పూజలు చేస్తున్నారు మెహబూబాబాద్ పట్టణ శివారు అనంతరం గ్రామానికి చెందిన పెరమాళ్ళపల్లి శేషయ్య ఎల్లమ్మ దంపతులకు వెంకట్ విజయ్ జనార్ధన్ అనే కుమారులు ఉన్నారు తల్లిదండ్రులు కష్టపడి కూలి పనిచేసి కుమారులను ఉన్నతులుగా తీర్చిదిద్దారు పెద్ద కుమారుడు వెంకట్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఫార్మసిస్టుగా రెండో కుమారుడు విజయ్ విద్యుత్ శాఖలో డి ఈ గా చిన్న కుమారుడు జనార్ధన్ లైన్మెన్ గా పనిచేస్తున్నారు తల్లిదండ్రుల మరణానంతరం అనంతారం గ్రామ శివారులోని తమ వ్యవసాయ భూమిలో 2021లో ఆలయం నిర్మించి విగ్రహాలను నెలకొల్పారు తల్లిదండ్రుల జయంతి వర్ధంతి ఇతర పండగలతోపాటు ప్రతి ఆదివారం అక్కడికి వెళ్లి పూజలు చేస్తామని విజయ్ తెలిపారు.
ఆధ్యాత్మిక విశేషాలు, పూజలు, దేవాలయాలు, సాంప్రదాయాలు తదితర ఆధ్యాత్మిక విషయాల సమాహారం..
3, ఫిబ్రవరి 2024, శనివారం
సీతారామాంజనేయ ఆలయ కమిటీ ఎన్నిక
గాంధారి మండల కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న సీతారామాంజనేయ స్వామి ఆలయ నూతన కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు స్థానిక భోగేశ్వరాలయంలో సమావేశమైన ఆలయ నిర్మాణ కమిటీ శాశ్వత సభ్యులందరూ కలిసి ఆలయ కమిటీ అధ్యక్షుడిగా ఎనుగందుల మహేష్ ఉపాధ్యక్షుడిగా మంగళ సాయిబాబా కార్యదర్శిగా భాస్కర్ గౌడ్ కోశాధికారులుగా బండి రాజులు రెడ్డి సాయిలు, కార్యవర్గ సభ్యులుగా వెంకట్ చారి దత్తాత్రేయ గౌడ్ గంగి సంతోష్ పత్తి ప్రవీణ్ సంతోష్ గౌడ్ సిందే సందీప్ సలహాదారులుగా తాడ్వాయి సంతోష్ మంగళ శ్రీనివాస్ దేశ్ పాండే రవి చాకలి మోహన్ శ్రీకాంత్ గౌడ్ ఆకుల రాకేష్ ను ఎన్నుకున్నారు నూతన కమిటీని సన్మానించారు ఈ సందర్భంగా నూతన కమిటీ బాధ్యులు మాట్లాడుతూ అందరి సహకారంతో ఆలయ నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా కృషి చేస్తామని తెలిపారు

