మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు తమ తల్లిదండ్రులని ఆ కుమారులు అలా భావించడమే కాదు వారికి ఆలయం కూడా నిర్మించారు అందులో వారి విగ్రహాలు నెలకొల్పి పూజలు చేస్తున్నారు మెహబూబాబాద్ పట్టణ శివారు అనంతరం గ్రామానికి చెందిన పెరమాళ్ళపల్లి శేషయ్య ఎల్లమ్మ దంపతులకు వెంకట్ విజయ్ జనార్ధన్ అనే కుమారులు ఉన్నారు తల్లిదండ్రులు కష్టపడి కూలి పనిచేసి కుమారులను ఉన్నతులుగా తీర్చిదిద్దారు పెద్ద కుమారుడు వెంకట్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఫార్మసిస్టుగా రెండో కుమారుడు విజయ్ విద్యుత్ శాఖలో డి ఈ గా చిన్న కుమారుడు జనార్ధన్ లైన్మెన్ గా పనిచేస్తున్నారు తల్లిదండ్రుల మరణానంతరం అనంతారం గ్రామ శివారులోని తమ వ్యవసాయ భూమిలో 2021లో ఆలయం నిర్మించి విగ్రహాలను నెలకొల్పారు తల్లిదండ్రుల జయంతి వర్ధంతి ఇతర పండగలతోపాటు ప్రతి ఆదివారం అక్కడికి వెళ్లి పూజలు చేస్తామని విజయ్ తెలిపారు.
No comments:
Post a Comment