4, ఫిబ్రవరి 2024, ఆదివారం

కొమురవెల్లి బ్రహ్మోత్సవాల్లో నేడు మూడో వారం

 ముగిసిన పట్నం లష్కర్ వారాలు



సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నేడు మూడవ ఆదివారం కావడంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు సుమారు 50000 మంది భక్తులు రానున్నట్లు అధికారులు అంచనా వేశారు స్వామివారి క్షేత్రానికి వచ్చిన భక్తులు మల్లన్న దర్శించుకోవడంతోపాటు పట్నం వేసి బోనం సమర్పించుకుంటారు మహా మండపం గంగ రేగి చెట్టు ఆవరణతోపాటు బస చేసే గదుల వద్ద పట్నాలు వేస్తారు స్థానిక గుట్ట పైన ఉన్న ఎల్లమ్మకు బోనం సమర్పిస్తారు అనంతరం కొండ పోచమ్మ నల్ల పోచమ్మ ఆలయాల్లో బోనాలు సమర్పిస్తారు

శివాలయంలో అభిషేకం, సరస్వతి ఆలయ సందర్శన

 కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ లోని వెంకటేశ్వర ఆలయ ఆవరణలో గల శివాలయంలో శనివారం శివ స్వాములు అభిషేకాన్ని నిర్వహించారు ఆలయ అర్చకుడు రవి కాంతి చారి ఆధ్వర్యంలో అర్చనలు అభిషేకాలు నిర్వహించారు కార్యక్రమంలో శివ స్వాములు జమాల్పూర్ భుజంగరావు పెద్దోళ్ళ శశికాంత్ రావుల రజనీకాంత్ చిన్నోళ్ల రామకృష్ణ ఇట్టి శంకర్రావు ముత్తురాజు తదితరులు ఉన్నారు

సరస్వతి ఆలయాన్ని దర్శించుకున్న విద్యార్థులు

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని నిలిచిపూర్ శివారులో సరస్వతి ఆలయాన్ని శనివారం కామారెడ్డి పట్టణంలోని బ్రిలియంట్ పాఠశాల విద్యార్థులు విద్యార్థినిలు దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దత్తాత్రేయ శర్మ విజయ్ పాండే ప్రమోద్ మిశ్రా పూజలు చేశారు పాఠశాల హెచ్ఎం తిరుపతి టీచర్లు ఉన్నారు