4, ఫిబ్రవరి 2024, ఆదివారం

త్రిలింగ రామేశ్వరాలయం పరిశీలన

 


నాగిరెడ్డిపేట్ మండలంలోని తాండూరు త్రిలింగ రామేశ్వర దేవాలయం మండల కేంద్రంలోని వేణుగోపాలస్వామి మాల్తు తు మ్మెద గ్రామంలోని పార్వతి అమ్మవారి ఆలయాలను టీటీడీ అధికారి డాక్టర్ రామానందం జడ్పిటిసి సభ్యుడు మనోహర్ రెడ్డితో కలిసి శనివారం పరిశీలించారు ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకు మండలంలోని ప్రాచీన ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు వెంట త్రిలింగ రామేశ్వర ఆలయ కమిటీ అధ్యక్షుడు కొమ్మ దత్తు సభ్యులు భీమ్ రెడ్డి రమేష్ దుర్గయ్య రమేష్ వంశీ శంకర్ నందు కిషన్ ఉన్నారు



ధర్మాన్ని కాపాడడం అందరి బాధ్యత

 ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉన్నదని తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి అన్నారు బిచ్కుంద లోని అయ్యప్ప స్వామి ఆలయంలో పూజారి గజానన్ పంతులు ఆధ్వర్యంలో బ్రాహ్మణ కుటుంబాలు సామూహికంగా శనివారం ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా భగవద్గీత విశ్లేషణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు మండలాల బ్రాహ్మణులు అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు