అయోధ్య రామ జన్మభూమిలో జరిగిన శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట ప్రసాదాన్ని పైడి ఎల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జహీరాబాద్ నియోజకవర్గం లోని 4 లక్షల కుటుంబాలకు పంపిణీ చేస్తున్నారు అయోధ్య అక్షింతలు మాదిరిగానే ప్రతి గ్రామానికి ప్రత్యేక వాహనాల ద్వారా లడ్డు ప్రసాదం వితరణకు ఏర్పాటు చేసినట్లు దాత పైడి ఎల్లారెడ్డి తెలిపారు ఆదివారం మండలం అబ్దుల్లా నగర్ లోని తన కార్యాలయం నుంచి ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు ప్రసాదాన్ని అందించారు ప్రతినిధులు బాల్రెడ్డి కిష్టయ్య రాజు నారాయణరెడ్డి రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
5, ఫిబ్రవరి 2024, సోమవారం
ఆలయాలకు భక్తుల పాదయాత్ర
గాంధారితోపాటు పోతంగల్ కలాం సర్వాపూర్ మేడిపల్లి గండిపేట్ గౌరారం సితాయి పల్లి ముద్దేల్లి తదితర గ్రామాలకు చెందిన పలువురు విఠలేశ్వరుని భక్తులు ఆదివారం పాదయాత్రగా మహారాష్ట్రలోని పండరీపూర్ కు బయలుదేరారు ఈ సందర్భంగా మండల కేంద్రంలోని విఠలేశ్వరాలయంలోని మూలవిరాట్కు ప్రత్యేక పూజలు చేశారు భక్తులు భజనలు చేస్తూ పాటలు పాడుతూ ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభించారు మార్గమధ్యంలో సర్వాపూర్ విఠలేశ్వరాలయం మురళి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న పండరీపూర్ చేరుకోవడానికి 13 రోజుల సమయం పడుతుందని భక్తులు తెలిపారు మద్దూర్ నుంచి పలువురు భక్తులు బీర్కూరు మండలంలోని నెమిలి సాయిబాబా ఆలయానికి ఆదివారం పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు ఉదయం సాయిబాబా ఆలయంలో పూజలు చేసిన అనంతరం గ్రామ ప్రత్యేకాధికారి డాక్టర్ విజయకుమార్ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు సాయి పల్లకి వ్రతం వెంట పాటలు పాడుతూ పాదయాత్ర కొనసాగించారు మార్గమధ్యంలో ఆయా గ్రామాల్లో దాతలు పాదయాత్ర భక్తులకు అల్పాహారం భోజనం మజ్జిగ తాగునీరు అందజేశారు



