7, ఫిబ్రవరి 2024, బుధవారం

భక్తజనసంద్రంగా కొండగట్టు

 ఒక్కరోజే 50 వేల మంది రాక 19 లక్షల రూపాయల ఆదాయం కొండగట్టు అంజన్న క్షేత్రం జనసంద్రంగా మారింది సమ్మక్క సారక్క జాతరకు తోడు మంగళవారం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది సుమారు 50 వేల మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారని అధికారులు తెలిపారు మరోవైపు ట్రాఫిక్ జాంతో జేఎన్టీయూ వరకు వాహనాలు నిలిచిపోయాయి దీంతో భక్తులు మూడు కిలోమీటర్ల దూరం కాలినడకన వచ్చి అంజన్న దర్శించుకున్నారు భక్తులతో కిక్కిరిసిపోయాయి వివిధ రకాల దర్శనాలను టికెట్లు ఇచ్చే కౌంటర్ ఒకటే ఉండటంతో భక్తులు బారులు తీరారు కాకా వివిధ రకాల పూజలు దర్శనం ద్వారా 19 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు శ్రీనివాస శర్మ ఏర్పాట్లు పర్యవేక్షించార



6, ఫిబ్రవరి 2024, మంగళవారం

విశ్వవ్యాప్తం హిందూ ధర్మం

 ముగిసిన శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు తిరుమలలో హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని ఇందుకు విస్తృత ప్రచారం చేయాలని ఇతర మతస్తులు స్వచ్ఛందంగా వస్తే హిందూ మతంలోకి స్వాగతించాలని తిరుమలలో జరిగిన ధార్మిక సదస్సు తీర్మానించింది తిరుమల ఆస్థాన మండపంలో మూడు రోజులపాటు జరిగిన శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు సోమవారం ముగిసింది ఈ సదస్సులో పీఠాధిపతులు, మఠాధిపతుల సూచనలతో చేసిన తీర్మానాలను టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాకు తెలియజేశారు శ్రీవారి దివ్య వైభవాన్ని సనాతన ధర్మాన్ని ప్రపంచవంతటా ప్రచారం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆవిర్భావం జరిగిందన్నారు గతంలో తాను చైర్మన్గా ఉన్నప్పుడు నిర్వహించిన ధార్మిక సదస్సులు స్వామీజీలు చేసిన సూచనల మేరకు దళిత గోవిందం మత్స్యగోవిందం అర్చకులకు శిక్షణ కల్యాణమస్తు తదితర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని అన్నారు మళ్ళీ ఇప్పుడు నిర్వహించిన ధార్మిక సదస్సులో పీఠాధిపతులు, మఠాధిపతులు చేసిన సూచనలతో పలు తీర్మానాలు చేశామని చెప్పారు ఇతర మతస్తులు ఎవరైనా హిందూమతంలో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తే వారికోసం తిరుమలలో ఒక ప్రాంగణం ఏర్పాటు చేయాలని పవిత్ర జలప్రోక్షణం తదితరాలు నిర్వహించి వారిని స్వాగతించాలని సదస్సులో తీర్మానం చేశారు శిథిలమైన దేవాలయాలను పునరుద్ధరణతో పాటు దేవాలయాలు లేని చోట హరిజన గిరిజన మత్స్యకార ప్రాంతాల్లో ఆలయాలు నిర్మించడం అవసరమని తీర్మానం చేశారు గోమాతల సంరక్షణ వేద శాస్త్రాల పరిరక్షణ ఎంతో ముఖ్యమని అందరికీ అర్థమయ్యేలా ధర్మాన్ని ప్రచారం చేయాలని తీర్మానించారు హిందూ సమాజంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి తగిన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ద్రవిడ వేదానికి తగిన ప్రోత్సాహం అవసరమని వివిధ పాఠశాలల్లో అమలులో ఉన్న పాఠ్య ప్రణాళికలు హిందూ ధర్మానికి పెద్ద పీట వేయాలని తీర్మానం చేశారు తెలుగు సంస్కృతంలో ఉన్న హిందూ ధర్మానికి సంబంధించి అంశాలు అర్థం చేసుకునేందుకు పిల్లలకు యువతకు ఆ రెండు భాషలు నేర్పించాలని ధర్మ ప్రచారం కోసం అన్ని ప్రచార ప్రసార మాధ్యమాలను ఉపయోగించుకోవాలని తీర్మానించారు ఇలాంటి ధార్మిక సదస్సులు ఏడాదికి ఒకసారి తిరుమల లేదా తిరుపతిలో నిర్వహించాలని గ్రామ జిల్లా స్థాయిలో కూడా తరచూ నిర్వహించాలని తీర్మానం చేశారు అన్ని ధార్మిక సంస్థలు అమలు చేయాలని తీర్మానించారు.