7, ఫిబ్రవరి 2024, బుధవారం

భగవద్గీతతో జీవితం సార్థకం

 రెండో రోజు కొనసాగిన సాధు సమ్మేళన చతుర్ధ మహాసభ

లోకంలో అన్నింటికంటే సత్సంగమే గొప్పదని పీఠాధిపతులు ప్రవచించారు మానవులు తమ జీవితాలను సార్ధకం చేసుకోవాలంటే భగవద్గీతను తప్పక అనుసరించాలని పేర్కొన్నారు డిచ్పల్లి మండల కేంద్రంలోని వేడుకల కేంద్రంలో రెండో రోజు సాధు సమ్మేళన చతుర్ధ మహాసభలు కొనసాగాయి సభలో తిరుపతిలోని శ్రీనివాస మంగాపురం వశిష్టాశ్రమాధిపతులు స్వరూపానందగిరి స్వామి సాంఖ్యయోగంపై ప్రవచించగా వశిష్ట సంచార సత్సంగ సంస్థాపక అధ్యక్షుడు సచ్చిదానందగిరి స్వామి విష్ణు సేవానందగిరి స్వామి కరీంనగర్ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం గురించి తెలిపారు రాజరత్నం గురూజీ మెట్పల్లి పంచ కోశాలు సద్విచార సిద్ధి సమాధి యోగం పై మాట్లాడారు ఉమ్మడి జిల్లా నుంచి భక్తులు హాజరయ్యారు కార్యక్రమంలో ఆచార్య పరిశుద్ధానందగిరి స్వామి హైదరాబాద్ భూమాత్మానందమహారాజు కృష్ణానంద స్వామి కామారెడ్డి విష్ణు సేవానందగిరి స్వామి శుద్ధ బ్రహ్మానందగిరి స్వామి నిర్మలానందగిరి స్వామి షీలానందగిరి మాతాజీ హరిప్రియ నందగిరి మాతాజీ తదితరులు పాల్గొన్నారు




మార్చి 8న ఎములాడలో మహాశివరాత్రి జాతర

 వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మార్చి 7 8 9 తేదీల్లో మహాశివరాత్రి జాతర నిర్వహించనున్నామని దేవస్థాన అధికారులు తెలిపారు 7న రాత్రి 7:30 గంటలకు టిటిడి అధికారులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు అర్ధరాత్రి 8వ తేదీ 12 గంటల నుంచి రెండున్నర గంటల వరకు స్థానిక ప్రజలకు సర్వదర్శనం రెండున్నర నుంచి మూడున్నర గంటల వరకు ప్రజాప్రతినిధులకు స్థానిక అధికారులకు దర్శన అవకాశం కల్పిస్తామన్నారు మూడున్నర నుంచి నాలుగు మూడు నాలుగు నిమిషాల వరకు మంగళ వాయిద్యాలు 3:40 నుంచి 4 30 గంటల వరకు సుప్రభాత సేవ ఆలయ శుద్ధి నాలుగో 30 నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రాతఃకాల పూజ అనువంశిక అర్చకుల దర్శనం ఉంటుందన్నారు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు శివదీక్ష స్వాములకు దర్శనం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు మహాలింగార్చన అనువంశిక బ్రాహ్మణుల దర్శనం ఉంటుందన్నారు లింగోద్భవ సమయమైన రాత్రి 11:35 నుంచి స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారని చెప్పారు