మద్నూర్ మండలంలోని కొడిచిరా గ్రామంలో గ్రామస్తులు దళితవాడలో నిర్మించనున్న విఠలేశ్వరాలయానికి బిచ్కుంద మండలం కథగాం మహారాజ్ మల్లికార్జున స్వామి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఆలయాలు పెరగడం వల్ల ధర్మ రక్షణ పెరుగుతుందని ప్రతి ఒక్కరూ నిష్టగా ఉండాలన్నారు కార్యక్రమంలో సర్పంచ్ సంతోష్ మాజీ ఏఎంసీ చైర్మన్ సంగమేశ్వర్ ధర్మజాగరణ కార్యకర్త గంగాధర్ తదితరులు పాల్గొన్నారు
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
7, ఫిబ్రవరి 2024, బుధవారం
నేడు మేడారంలో గుడి మెలిగే పండుగ
తెలంగాణ కుంభమేళాగా భావించే మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు ప్రారంభ సూచికగా భావించే తొలి పూజ బుధవారం జరగనుంది ఈనెల 21 నుంచి 24 వరకు గిరిజన జాతర జరగనుండగా సనాతన ఆచారం ప్రకారం మనదేవతల వడ్డీలు పూజారులు బుధవారం గుడి మెలిగే పండుగ నిర్వహించనున్నారు ఈ తంతుతో జాతరకు అంకురార్పణ జరిగినట్లు భావిస్తారు జాతరలో భక్తుల పూజలు అందుకునే ప్రధాన దేవతలు సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజుల పూజా మందిరాలు గతంలో గడ్డి గుడిసెలుగా ఉండేవి మహా జాతరకు రెండు వారాల ముందు పాతబడ్డ పైకప్పు కర్రలను తొలగించేవారు ఆదివాసి సంప్రదాయాల ప్రకారం దేవుళ్లకు పూజలు చేసి గుడి శుద్ధి కార్యక్రమాన్ని జరిపేవారు దీనిని గుడి మెలిగే పండుగగా పిలుస్తారు కాలక్రమంలో గడ్డి గుడిసెల స్థానంలో శాశ్వత ప్రాతిపదికన పూజా మందిరాలు నిర్మితమయ్యాయి అయినా సంప్రదాయాలు కొనసాగింపుగా పూజారులు గుడి మెలిగే తంతును జరుపుతూ వస్తున్నారు బుధవారం ఉదయం మేడారంలోని సమ్మక్క కన్యపల్లిలోని సారాలమ్మ కొండాయలోని గోవిందరాజు పూనుగుండ్లలోని పగిడిద్దరాజు ఆలయాల్లో వడ్డెలు సంప్రదాయ పూజలు చేస్తారు ఆ తర్వాత ఆలయాలను శుద్ధి చేయనున్నారు అనంతరం ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తారు జాతర ప్రారంభ సూచికగా తొలి పూజ జరుగుతుండటంతో బుధవారం వనదేవతల గద్దెల దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు మేడారం తరలిరానున్నారు వచ్చే బుధవారం ప్రధానమైన మండ మెలిగే పండుగ జరగనుంది

