8, ఫిబ్రవరి 2024, గురువారం

ముగిసిన సాధు సమ్మేళనం

 గత మూడు రోజులుగా డిచ్పల్లి మండల కేంద్రంలోని ఎస్ఎల్జి గారిలో కొనసాగుతున్న వశిష్ట సంచార శతసంగ మహోత్సవ సంబరాలు సాధు సమ్మేళనం బుధవారం సాయంత్రం ఘనంగా ముగిశాయి ఆచార్య పరిపూర్ణానందగిరి విష్ణు సేవానంద స్వామి శంకరానంద స్వామి బ్రహ్మశ్రీ తుకారాం జగదీశ్వరానంద స్వామి అనంత నందగిరి స్వామి ఓంకార నంద స్వామి పురుషోత్తమహారాజు శ్రీ రాజా రామానందమహారాజు బ్రహ్మానందమహారాజు స్వాములు భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషను చేశారు ప్రతి ఒక్కరూ భగవద్గీత పారాయణం ద్వారా ఏకాగ్రత నెలకొంటుందని సాధు సమ్మేళనం ద్వారా జాన యజనం నెలకుంటుందన్నారు ఇందులో ఎంపీపీ గద్దె భూమన్న పార్శ సంధ్యారాణి రాజేందర్ రాజారాం లక్ష్మణ్ వెంకటేశ్వర్లు అశోక్ భరత్ భూషణ్ పాల్గొన్నారు



7, ఫిబ్రవరి 2024, బుధవారం

మేడారం మహా జాతరకు ప్రత్యేక బస్సులు

 మేడారం మహా జాతర సందర్భంగా ఈనెల తొమ్మిది నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు టిఎస్ఆర్టిసి రంగారెడ్డి రీజినల్ మేనేజర్ ఏ శ్రీధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు ఎంజీబీఎస్ నుంచి మూడు బస్సులు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి రెండు బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు పెద్దలకు 750 రూపాయలు పిల్లలకు 450 రూపాయలుగా బస్సు చార్జీలను నిర్ణయించామన్నారు టిఎస్ఆర్టిసి ఆన్లైన్ రిజర్వేషన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు