8, ఫిబ్రవరి 2024, గురువారం

అయ్యప్ప స్వామి ఆలయంలో అన్నదానం

 ఎయిర్ కట్ల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి సేవా సమితి సభ్యులు బుధవారం అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతినెలా మొదటి బుధవారం అయ్యప్ప స్వామి ఆలయంలో దాతల ద్వారా అన్నదానం నిర్వహిస్తామని ఈ బుధవారం దాతగా చంద్రం రాములు గౌడ్ అనసూయ ఉన్నారని తెలిపారు వారికి అయ్యప్ప స్వామి సేవా సమితి సభ్యులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు



కృష్ణానదిలో పురాతన విగ్రహాలు

 కొన్ని వందల ఏళ్ల క్రితం నాటివిగా భావిస్తున్న శివలింగం విష్ణు విగ్రహం కర్ణాటక రాయచూరు జిల్లాలో కృష్ణా నదిలో బయటపడ్డాయి జిల్లాలోని దేవసుగూర్ గ్రామానికి సమీపంలో కృష్ణా నదిపై వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఈ సందర్భంగా నదిలో చేపట్టిన తవ్వకాల్లో హిందూ దేవత విగ్రహాలు లభ్యమయ్యాయి నీటిలో లభ్యమైన విష్ణు విగ్రహం అయోధ్య రామాలయంలో బాలరాముడిని పోలి ఉండటం గమనార్హం