8, ఫిబ్రవరి 2024, గురువారం

ఆలయ నిర్మాణానికి లక్ష రూపాయల విరాళం

 ముక్కాల్ మండల కేంద్రంలోని దూలగుట్ట వద్ద కొత్తగా నిర్మించనున్న దేవి అమ్మవారి ఆలయం కోసం టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముప్కాలు మాజీ సర్పంచ్ ముసుకు భూమేశ్వర్ గురువారం లక్ష రూపాయలు విరాళం అందజేశారు ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులకు చెక్క అందజేశారు ఆలయ ట్రస్టు సభ్యులు కంచు విజయ్ టి సాయవ్వ గద్దల గంగారం చిన్న బాలరాజ్ గొర్రె చిన్న రాజవ్వ రేవతి శివలింగం గంగారాం ముత్తన్న పాల్గొన్నారు



అంజన్న హుండీ ఆదాయం 83 లక్షలు

 జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న సన్నిధిలోని తొమ్మిది హుండీలను గురువారం లెక్కించారు గడిచిన 28 రోజుల్లో భక్తులు కానుకల రూపంలో 83 లక్షల 9152 నగదు 32 గ్రాముల మిశ్రమ బంగారం 4:30 కిలోల మిశ్రమ వెండి 13 విదేశీ కరెన్సీ నోట్లు సమర్పించారు హుండీల లెక్కింపును ఆలయ ఈవో వెంకటేష్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ ఏఈఓ అంజయ్య సూపర్ఇంటెండెంట్లు శ్రీనివాస శర్మ సునీల్ పర్యవేక్షించారు