9, ఫిబ్రవరి 2024, శుక్రవారం

నేడే త్రీ హిల్స్ అన్నపూర్ణేశ్వరి జాతర

 


సిరికొండ మండలంలోని పెద్దవాల్గొట్ సమీపాన గల త్రీ హిల్స్ అన్నపూర్ణేశ్వరి జాతర శుక్రవారం జరుగుతుంది గురువారం పెద్దవాల్గొట్ గ్రామంలో అన్నపూర్ణేశ్వరి దేవి ఉత్సవ విగ్రహాన్ని భక్తులు ఆలయ కమిటీ సభ్యులు పల్లకిలో అలంకరించి అన్నపూర్ణేశ్వరి దేవిని ప్రసాద్ బేరి నిర్వహించారు భక్తుల దర్శనార్థం గ్రామంలో భజనలు చేస్తూ ప్రజల వద్దకు దేవుని తీసుకెళ్లారు భక్తులు సాహిత్యాన్ని కానుకలను సమర్పించుకున్నారు ఆంజనేయ కుమారస్వామి ఆలయాల వద్ద యజ్ఞం నిర్వహించారు దేవుని సాయంత్రం 3 హిల్స్ కొండపైకి డప్పుల చప్పుళ్ల మధ్య పల్లకిలో తరలించారు శుక్రవారం ఉదయం నుంచి కొండపై యజ్ఞం నిర్వహించడం జరుగుతుందని ఆలయాల కమిటీ సభ్యులు తెలిపారు భక్తులు దేవిని దర్శించుకుని మొక్కులను సాయంత్రం భక్తులు ఆనందోత్సవాల మధ్య రథోత్సవం జరుగుతుంది ఉదయం నుంచి జాతరకు వచ్చే భక్తుల కోసం అన్న సత్రం ఏర్పాటు చేశారు



నేడు చిలుకల చిన్నమ్మ జాతర

 




బాల్కొండ మండలం శ్రీరాంపూర్ గ్రామంలో శుక్రవారం జరిగే చిలకల చిన్నమ్మ జాతర ఉత్సవాల నిర్వహణ కోసం ఆలయం రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు ఉత్సవాలు నిర్వహించేందుకు గ్రామ అభివృద్ధి కమిటీ ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు వారి పేర్కొన్నారు ఉదయం అమ్మవారికు అభిషేకం నూతన వస్త్రాలంకరణ తీర్థప్రసాదాల వితరణ నిర్వహించనున్నట్టు వారు తెలిపారు