26, ఫిబ్రవరి 2024, సోమవారం

ముగిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

 వారం రోజులుగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు ఫల అభిషేకాలు హోమం ద్వజారోహణం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని పల్లకి సేవలతో కన్నుల పండుగ నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఆదివారంతో ముగిశాయి.

ఉత్సవాలలో భాగంగా దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టముఖి కోనేరు  లోపుణ్య స్థానాల ఆచరించి బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.

కొచ్చేరి మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

 నసురుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ శివారులో గల కొచ్చేరి మైసమ్మ ఆలయంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కాకుండా వివిధ మండలాల భక్తులు వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి ముక్కులు చెల్లించుకున్నారు అనంతరం భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ ప్రాంగణంలో  సహపంక్తి భోజనం చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు