నసురుల్లాబాద్ మండల పరిధిలో మైలారం గ్రామ శివారులో శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో శుక్రవారం రోజున శివ స్వాములకు అన్నదాతగా నిలిచిన మైనారిటీ యూత్ యువకులు కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మైనారిటీ యూత్ అధ్యక్షులు మాట్లాడుతూ మనందరం కులాలకు మతాలకు అతీతంగా కలిసి మెలిసి ఉండాలని మతసామరస్యాన్ని పాటించాలని అన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన శివ స్వాములకు దేవస్థాన కమిటీకి ఆయన ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు కార్యక్రమంలో మైనారిటీ యూత్ సభ్యులు శివ స్వాములు గ్రామ పెద్దలు పాల్గొన్నారు
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
2, మార్చి 2024, శనివారం
శ్రీ భగలాముఖి అమ్మవారి క్యాలెండర్ ఆవిష్కరణ
కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని స్వయంసిద్ధ క్షేత్రంగా వెలసిల్లిన శ్రీ భగలాముఖి అమ్మ వారి క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ప్రతినెల రెండవ అష్టమి రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారి కటాక్షానికి పాత్రులు కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకుడు ఫిలిం సెన్సార్ బోర్డ్ మెంబర్ ఆతిమాముల రామకృష్ణ గుప్త ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు ఎర్రం విజయ్ ఐవిఎఫ్ యువజన విభాగం రాష్ట్రం ఉపాధ్యక్షుడు కొండ శైలేందర్ ఎస్ఆర్కే కళాశాల ప్రిన్సిపాల్ అమృత దత్తాద్రి పబ్బ వేణులు పాల్గొనడం జరిగింది
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)


