6, మార్చి 2024, బుధవారం

శ్రీశైలంలో వైభవంగా పుష్ప పల్లకి సేవ

 శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి 11 రోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో ఆరో రోజు బుధవారం ఉదయం భ్రమరాంబ మల్లికార్జున స్వామికి పూజలు నిర్వహించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు సాయంత్రం స్వామి అమ్మవార్ల పుష్ప పల్లకి ఉత్సవం శోభాయ మానంగా సాగింది



కాలేశ్వరం ముక్తేశ్వర ఆలయంలో శివరాత్రి వేడుకలు

 జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాలేశ్వరంలోని కాలేశ్వరం ముక్తేశ్వర ఆలయంలో ఈనెల ఏడు నుంచి తొమ్మిది వరకు మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి ఈ సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల విద్యుత్ దీపాలతో అలంకరించారు