Monday, 26 February 2024

అభయమిచ్చే అనంతపద్మనాభుడు

 భక్తుల కొంగుబంగారము అనంత పద్మనాభ స్వామి ఆలయం రేపటి నుంచి వారం రోజులపాటు ఆలయ బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు చేస్తున్న లక్ష్మాపూర్ మల్కాపూర్ ఏ గ్రామస్తులు

నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్ ఏ గ్రామ శివారులో గల శ్రీ లక్ష్మీ అంత పద్మనాభ స్వామి ఆలయం భక్తులకు బంగారంగా ప్రసిద్ధికి ఎక్కింది భక్తిశ్రద్ధలతో పూజిస్తే కోర్కెలు నెరవేరుతాయి అని భక్తుల విశ్వాసం గ్రామ శివారు గుట్ట ప్రాంతంలో ఒక గుహలో నరసింహస్వామి రూపంలో వెలసిన శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు వృత్తాకారంలోనే శంఖ చక్రధారుడిగా వెలసి దినదినం తన రూపాన్ని పెంపొందించుకుంటూ భక్తుల కోరికలు తీరుస్తున్నాడు అనంత పద్మనాభ స్వామి ఆలయ ఉత్సవాలు ఈనెల 27వ తేదీ నుండి మార్చి మూడు మూడవ తేదీ వరకు నిర్వహించనున్నారు ఇందుకోసం లక్ష్మాపూర్ మల్కాపూర్ ఏ గ్రామాల అభివృద్ధి కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు ఏటా మాఘమాసంలో తదియ నుండి నష్టం వరకు వారం రోజులపాటు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తారు

చిన్న బిందు రూపంలో వెలసిన శ్రీ లక్ష్మీ అనంతపద్మనాభ స్వామి క్రమక్రమంగా పెరుగుతూ పూర్తి రూపాన్ని సంతరించుకున్నాడు ఇరుకైన రాళ్ల మధ్యలో శంకు చక్రం వక్షస్థల వాయాంశంపై కొలువు దీరిన శ్రీ లక్ష్మీ సహిత అనంతపద్మనాభుడిగా భక్తులకు దర్శనమిస్తున్నారు స్వామివారి నిజరూపం గుహలో ఇరుకైన రాళ్ల మధ్యలో చిన్న ఖాళీ స్థలంలో ఉన్నది భక్తుల సౌలభ్యం కోసం అదే గుహలో కింది భాగంలో మరో విగ్రహాన్ని ప్రతిష్టించారు వేటా భాద్రపద మాసంలో అనంత చతుర్దశి రోజున నిర్వహించే అనంతపద్మనాభుడి వ్రతం అత్యంత శక్తివంతమైనదని భక్తుల విశ్వాసం పవిత్రమైన దీక్షతో ఏడు శిరస్సులు కలిగిన సర్ప రూపంలో అనంత పద్మనాభ స్వామిని ప్రతిష్టించి ఆ ప్రతిమను 16 నూలు పోగులతో తయారు చేసిన మాలను అలంకరించి అత్యంత పవిత్రంగా నియమనిష్ఠలతో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వ్రతాన్ని ఆచరిస్తున్నారు 27వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ఈనెల 27వ తేదీ నుండి ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవనున్నాయి మొదటిరోజు అంకురారోహణ రుత్వికుల దీక్ష ధారణ హారతి మంత్రపుష్పం 28వ తేదీన సుప్రభాత సేవ ధ్వజారోహణం 29వ తేదీన మధ్యాహ్నం శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారి కల్యాణోత్సవం మార్చి ఒకటవ తేదీన డోలారోహణం రెండవ తేదీన రథోత్సవం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు మూడవ తేదీన ఉదయం పూర్ణాహుతి చక్రతీర్థము నాగవెల్లి బాదషా వర్ణ పూజ సప్తావరన పూజలు దేవతా ఉద్వాసన భూత బలి ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు సంపూర్ణం అవుతాయి జాతర సహకారంతో అష్టముఖి కోనేరు నిర్మాణం నలుగురు దాతలు అందించిన విరాళాలతో ఆలయ ఆరణాలు మూడు లక్షల రూపాయలతో అష్టముఖి కోనేరుగా కొత్తగా నిర్మించారు ఈ కోనేరు ఇటీవల స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి గ్రామ పెద్దలతో కలిసి సందర్శించారు 60 లక్షల రూపాయలతో బిటి సిసి రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఆలయ ముఖద్వారం నుండి ఆలయం పై వరకు ఆలయ ఆవరణలో సిసి రోడ్డును నియమించనున్నారు





No comments:

Post a Comment