మహాశివరాత్రిని పురస్కరించుకొని శ్రీశైలంలో శుక్రవారం బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి తొలిరోజు వేద పండితులు అర్చకులు యాగశాల ప్రవేశం చేసి అంకురార్పణ చేశారు రాత్రి 7 గంటలకు ధ్వజారోహణ భేరీ పూజ నిర్వహించి సకల దేవతలకు ఆహ్వాన సూచికగా ద్వజపతాకాన్ని ఆవిష్కరించారు శ్రీశైల ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఏడు రోజులు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 11 రోజులపాటు నిర్వహిస్తామని ప్రధాన అర్చకులు వీరయ్య స్వామి తెలిపారు శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున స్వామి వార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు ఆ దేవస్థాన ఈవో ఎస్వి నాగేశ్వరరావు ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి దంపతులు పాల్గొన్నారు స్వామివారు బృంగి వాహన సేవలో దర్శనమిస్తారు స్వామి అమ్మవార్లను అలంకరించి ఆలయ పురవీధులలో గ్రామోత్సవం నిర్వహిస్తారు
No comments:
Post a Comment