Saturday, 2 March 2024

కన్నుల పండుగగా సంతోషిమాత ఆలయ వార్షికోత్సవం

 


మద్నూర్ మండల కేంద్రంలోని సంతోషిమాత ఆలయ వార్షికోత్సవం కన్నుల పండుగ జరిగింది మూడు రాష్ట్రాల భక్తులు తరలివచ్చారు తెల్లవారుజాము నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు ప్రతి ఏడాది మహాశివరాత్రికి ముందు శుక్రవారం ఆలయ వార్షికోత్సవం నిర్వహిస్తారు.

ఆలయ నిర్వాహకురాలు సంతోషి యజ్ఞ కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్య అతిథిగా రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి అధ్యక్షుడు కళ్యాణానంద స్వామీజీ భక్తులను ఉద్దేశించి మాట్లాడారు కుంకుమార్చన పూర్తికాగానే యజ్ఞ కార్యక్రమం ప్రారంభించారు సాయంత్రం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కల్యాణానంద స్వామీజీ మాట్లాడుతూ భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయం గొప్పదని ఆలయాలను దర్శించుకుని భక్తులు కోరిన కోర్కెలు తీర్చుకుంటారని గుర్తు చేశారు నీటి యువత పాఠ్యాంశ సంస్కృతిని అవలంబించి భారత సంస్కృతిని మరిచిపోతుందని తల్లితండ్రులు సంస్కృతి సంప్రదాయాలను గుర్తుచేయాలని అన్నారు ఆలయాలకు తీసుకెళ్లి ఆలయ విశిష్టతను తెలియజేయాలని గుర్తు చేశారు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా సంస్కృతి సాంప్రదాయాల విలువలు గుర్తిస్తే వాటిని దూరం చేసుకోవచ్చని తెలిపారు కార్యక్రమానికి కాయ రాష్ట్రాల తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర నుంచి భక్తులు రావడంతో ఆలయం కిటకిటలాడింది


No comments:

Post a Comment