31, జనవరి 2024, బుధవారం

సరస్వతి దేవి మాల ధారణ కరపత్రాలు ఆవిష్కరణ

 బాన్స్వాడలోని సరస్వతి దేవి మాల ధారణ కరపత్రాలను బుధవారం సరస్వతి ఆలయంలో ఆలయ ధర్మకర్త శంభు రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్ఞాన సరస్వతి దేవి 34వ దీక్ష స్వాములు మాల ధారణకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించినట్లు తెలిపారు వసంత పంచమి పురస్కరించుకొని మాల విరమణ ఉంటుందని అన్నారు సరస్వతి ఆలయం వద్ద మండల పూజ మహోత్సవం నిర్వహించనున్నట్టు తెలిపారు ఆలయ అర్చకులు సంతోష్ శర్మ దీక్ష స్వాములు విజయ్ తుకారం రితేష్ బసంత్ శ్రీనివాస్ గౌడ్ ప్రశాంత్ గౌడ్ అరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



ఆలయానికి విరాళాల అందజేత

 పోతు రెడ్డి పల్లి హనుమాన్ ఆలయానికి భూదానం కోసం బుధవారం భక్తులు నగదు విరాళాలను అందజేశారు నిజాంసాగర్ మండలంలోని గోర్కల్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు దుర్గారెడ్డి 5000 పిట్లం మండలంలోని బుర్నాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి 5000 రూపాయలు బంకుల లక్ష్మారెడ్డి ఐదువేల రూపాయలు ముడుకున్చల్ కు చెందిన ప్రతాపరెడ్డి 5000 రూపాయలు తడకలకు చెందిన గోపాల్ చారి 6000 ఆలయ భూదానం కోసం ఆలయ నిర్వహణ తేజస్వామికి అందజేశారు