2, ఫిబ్రవరి 2024, శుక్రవారం

బడా రామ్ మందిర్ హుండీ లెక్కింపు

 నిజామాబాద్ నగరంలోని బడా రామ్ మందిర్ హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు నగరంలోని బ్రహ్మపురి గాజులపేట్ లో గల బడా రామ్ మందిర్ హుండీ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని గింజుపల్లి వేణు తెలిపారు నోట్లు 9710 నాణెములు 1617 రూపాయలు మొత్తం 11327 రూపాయలు వచ్చాయని తెలిపారు హుండీ లెక్కింపులో గత నెల 15 రోజులది అని హుండీ లెక్కింపులో దేవాదాయ శాఖ నిజామాబాద్ పరిశీలకులు కావాలా వడారం మఠం విత్ పర్సన్ గింజుపల్లి వేణు భక్తులు జి.రామచంద్ర గంగారెడ్డి నరేష్ సాగర్ అర్చకులు బ్రహ్మేశ్వర్ శ్రీనివాసచార్యులు శశి కుమార్, రాందాసి జూనియర్ అసిస్టెంట్ టి ప్రశాంత్ కుమార్ సహాయకులు నాగరాజు తదితరులు పాల్గొనడం జరిగింది.



ముగిసిన మహాలక్ష్మి జాతర

 తానూర్ మండలంలోని కోలూరు గ్రామంలో శుక్రవారం మహాలక్ష్మీ జాతర వైభోపీతంగా కన్నుల పండుగ సాగింది ఆలయంలో ప్రత్యేక పూజలు అర్చకులు గ్రామ పెద్దలు నిర్వహించారు మహాలక్ష్మీ మాత దర్శనానికి భక్తులు పోటెత్తారు వివిధ ప్రాంతాల్లో నుంచి ఉదయం నుంచి భక్తులు బారులు తీరారు భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సకల సౌకర్యాలు కల్పించారు జాతర నేపథ్యంలో దుకాణాలు నెలకొనడంతో సందడి అగుపడింది. అనంతరం జాతరను పురస్కరించుకొని కుస్తీ పోటీలను ప్రారంభించారు ఈ పోటీల్లో విజయం సాధించిన మల్లయోధులకు ₹77 ప్రథమ బహుమతిగా 555 రూపాయలు ద్వితీయ బహుమతిగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అందజేశారు అనంతరం మల్ల యోధులను ఆలయ కమిటీ వారు సన్మానించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చంద్రకళా శ్రీనివాస్ సురేష్ పటేల్, భూమారెడ్డి ఎల్లప్ప సాయినాథ్ చక్రధర్ పటేల్ ఆలయ కమిటీ సభ్యులు వార్డు మెంబర్లు వివిధ గ్రామానికి చెందిన మల్ల యోధులు ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నార.