Friday, 2 February 2024

ముగిసిన మహాలక్ష్మి జాతర

 తానూర్ మండలంలోని కోలూరు గ్రామంలో శుక్రవారం మహాలక్ష్మీ జాతర వైభోపీతంగా కన్నుల పండుగ సాగింది ఆలయంలో ప్రత్యేక పూజలు అర్చకులు గ్రామ పెద్దలు నిర్వహించారు మహాలక్ష్మీ మాత దర్శనానికి భక్తులు పోటెత్తారు వివిధ ప్రాంతాల్లో నుంచి ఉదయం నుంచి భక్తులు బారులు తీరారు భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సకల సౌకర్యాలు కల్పించారు జాతర నేపథ్యంలో దుకాణాలు నెలకొనడంతో సందడి అగుపడింది. అనంతరం జాతరను పురస్కరించుకొని కుస్తీ పోటీలను ప్రారంభించారు ఈ పోటీల్లో విజయం సాధించిన మల్లయోధులకు ₹77 ప్రథమ బహుమతిగా 555 రూపాయలు ద్వితీయ బహుమతిగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అందజేశారు అనంతరం మల్ల యోధులను ఆలయ కమిటీ వారు సన్మానించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చంద్రకళా శ్రీనివాస్ సురేష్ పటేల్, భూమారెడ్డి ఎల్లప్ప సాయినాథ్ చక్రధర్ పటేల్ ఆలయ కమిటీ సభ్యులు వార్డు మెంబర్లు వివిధ గ్రామానికి చెందిన మల్ల యోధులు ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నార.





No comments:

Post a Comment