4, ఫిబ్రవరి 2024, ఆదివారం

తొర్లికొండలో వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు

 జక్రంపల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ఉత్సవాలను భక్తులు గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు తెల్లవారుజామునంచే భక్తులు కొండపైకి చేరుకున్నారు అనంతరం స్వామివారి పల్లకిని భక్తులు కొండపై చుట్టూ ప్రదక్షిణ చేశారు ఆలయంలో భక్తులు గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేసి అప్పులు తీర్చుకున్నారు ఆలయం వద్ద భక్తుల కోసం అన్నదానం నిర్వహించారు నూతనంగా నిర్మించిన వెంకటేశ్వర స్వామి నిర్మాణానికి భక్తులు గ్రామస్తులు విరాళాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వీడిసి సభ్యులు భక్తులు పాల్గొన్నారు



శివదీక్ష చాలా పవిత్రమైంది

 


శివదీక్ష చాలా పవిత్రమైందని నిత్యం శివనామస్మరణతో సకల శుభాలు కలుగుతాయని వేద పండితులు గణేష్ మహరాజ్ అన్నారు శనివారం బోధన్ పట్టణంలోని ఏక చక్రేశ్వరాలయంలో శివ స్వాములు శివ దీక్షా సేవా సమితి ఏక చక్రపురం ఆధ్వర్యంలో స్వాములకు భిక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న బోధన ఎసిపి కిరణ్ కుమార్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు శివ స్వాముల పీఠం వద్ద శివ స్వాములతో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా శివ గురు స్వాములు మాట్లాడుతూ నేటి నుంచి మొట్టమొదటిసారిగా శివ స్వాములు శ్రీశైలంలోని ఆలయం వరకు పాదయాత్రగా వెళుతున్నారన్నారు ఇందులో గురుస్వాములు రామేశ్వరరావు హనుమాన్లు చారి నర్సింగప్ప వీరేశం గణేష్ నీలకంఠంతో శివ స్వాములు తదితరులు పాల్గొన్నారు