Sunday, 4 February 2024

శివదీక్ష చాలా పవిత్రమైంది

 


శివదీక్ష చాలా పవిత్రమైందని నిత్యం శివనామస్మరణతో సకల శుభాలు కలుగుతాయని వేద పండితులు గణేష్ మహరాజ్ అన్నారు శనివారం బోధన్ పట్టణంలోని ఏక చక్రేశ్వరాలయంలో శివ స్వాములు శివ దీక్షా సేవా సమితి ఏక చక్రపురం ఆధ్వర్యంలో స్వాములకు భిక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న బోధన ఎసిపి కిరణ్ కుమార్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు శివ స్వాముల పీఠం వద్ద శివ స్వాములతో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా శివ గురు స్వాములు మాట్లాడుతూ నేటి నుంచి మొట్టమొదటిసారిగా శివ స్వాములు శ్రీశైలంలోని ఆలయం వరకు పాదయాత్రగా వెళుతున్నారన్నారు ఇందులో గురుస్వాములు రామేశ్వరరావు హనుమాన్లు చారి నర్సింగప్ప వీరేశం గణేష్ నీలకంఠంతో శివ స్వాములు తదితరులు పాల్గొన్నారు



No comments:

Post a Comment