4, ఫిబ్రవరి 2024, ఆదివారం

భక్తి మార్గంలో నడవాలి

 ప్రతి వ్యక్తి భక్తి మార్గంలో నడవాలని పీఠాధిపతి మాధవానంద సరస్వతి పేర్కొన్నారు శనివారం బిచ్కుంద మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని భక్తుల నిర్దేశించి మాట్లాడారు ప్రతిరోజూ గంట పాటు దైవ సన్నిధిలో గడపడం వల్ల మానసిక ఆహ్లాదం కలుగుతుందన్నారు కార్యక్రమంలో శ్రీధర్ కులకర్ణి వెంకట్రావు భానుదాస్ కులకర్ణి వెంకట్ సాయి బాబా తదితరులు పాల్గొన్నారు



కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు

 జిల్లా కేంద్రంలోని ధర్మశాలలో శనివారం సహస్ర పారాయణం నిర్వహించారు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు సాయంత్రం దీపారాధన నిర్వహించారు

జిల్లా కేంద్రంలో హనుమాన్ ఆలయాల్లో శనివారం అర్చనలు చేశారు శ్రీరామ్నగర్ కాలనీలో భక్తాంజనేయ ఆర్బి నగర్ లో ఇష్ట కార్యసిద్ధి హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి భక్తులు ఆలయ కమిటీ ప్రతినిధులు హాజరయ్యారు