2, మార్చి 2024, శనివారం

యాదగిరిగుట్ట సమాచారం

 దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాలైన యాదాద్రి భద్రాద్రి ఆలయాల పేర్లను త్వరలో మార్చనున్నట్లు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య వెల్లడించారు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రము యాదాద్రి కొండపై భక్తులు కొబ్బరికాయలు కొట్టే స్థలాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు కొండపైన కొబ్బరికాయలు కొట్టే స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి ఆలయ తూర్పు రాజగోపురం ఎదురుగా దర్శనం క్యూలైన్ సమీపంలో కొబ్బరికాయలు కొట్టేందుకు ఏర్పాటు చేశామని తెలిపారు శుక్రవారం స్వాతి నక్షత్రం పురస్కరించుకొని కొబ్బరికాయలు కొట్టే స్థలాన్ని ప్రారంభించామని అన్నారు యుద్ధ ప్రాతిపదికన కొండపైన కొబ్బరికాయలు కొట్టేందుకు స్థలంతో పాటు డార్మెంటరీ హాల్ అర్చకులకు అదనపు సౌకర్యాలతో పాటు భక్తులకు పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు యాదాద్రి ఆలయంతో పాటు భద్రాద్రి రామన్న ఆలయాన్ని పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేసి చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్ళవలసి ఉందని తెలిపారు యాదాద్రి అభివృద్ధికి సీఎం నిధులు కేటాయిస్తానని అన్నారని తెలిపారు మరో 15 రోజుల్లో యాదాద్రి ఆలయం పై మరోసారి రివ్యూ సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు ఆలయ అర్చకుల కోసం రెస్ట్ రూమ్ వాష్ రూమ్, నిర్మాణం చేయాలని అధికారులకు సూచించారు అంతకుముందు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయన వెంట ఆలయ అనువంశిక చైర్మన్ బి నరసింహమూర్తి ఈవో రామకృష్ణారావు మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధా గుండ్లపల్లి భరత్ కానుగు బాలరాజు గుండ్ల వరలక్ష్మి గుండ్లపల్లి నరసింహ బందారపు బిక్షపతి రాము కరణ్ తదితరులు ఉన్నారు



కళ్ళకు గంతలతో అయోధ్యకు చేరుకున్న ఇంద్రజాలికులు

 8 రోజులు 1600 కిలోమీటర్లు కళ్ళకు గంతలతో ద్విచక్ర వాహనాలపై అయోధ్య రాముని చెంతకు లక్ష్యాన్ని చేరుకున్న ఇద్దరు ఇంద్రజాలికులు



హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరు ఇంద్రజాలకు వినూత్న ప్రయత్నం చేశారు కళ్ళకు గంతలు కట్టుకొని ఎనిమిది రోజులు ద్విచక్ర వాహనంపై సుమారు 1600 కిలోమీటర్లు ప్రయాణించి అయోధ్య బాలరాముడిని దర్శించుకుని అనుకున్న లక్ష్యం సాధించారు దిల్సుఖ్నగర్కు చెందిన మారుతి జోషి సరూర్నగర్ కు చెందిన రామకృష్ణ మిత్రులు ఇద్దరూ ఇంద్రజాలికులే మారుతి బ్యాంకు ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తూ సమయం దొరికినప్పుడల్లా మ్యాజిక్ షోలు చేస్తుండగా రామకృష్ణ పూర్తిస్థాయి మెజీషియన్ గా ప్రదర్శనలు ఇస్తున్నారు రామభక్తుడైన మారుతి జోషి అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో బాలరాముడిని దర్శించుకోవాలని అనుకున్నారు ఈ నేపథ్యంలోని భక్తిని వినూత్నంగా ప్రదర్శిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాలని భావించారు అందుకే కళ్లకు గంతలు ముసుగు వేసుకొని ద్విచక్ర వాహనంపై అయోధ్య చేరుకోవాలని సంకల్పించారు ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా ప్రమాదకర ప్రయాణం వద్దని వారించారు స్నేహితుడి రామకృష్ణ మారుతితో కలిసి వెళ్తానని చెప్పడంతో అంత ఒప్పుకున్నారు ఇలా ఫిబ్రవరి 23న ముచింతలోని చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు తీసుకొని యాత్ర ప్రారంభించారు తొలి రోజు ముచ్చింతల నుంచి కామారెడ్డి ఆదిలాబాద్ నాగపూర్ సీఎం లతన్ ధన్ కాశి తర్వాత శుక్రవారం రాత్రి అయోధ్య చేరుకొని రాముడిని దర్శించుకున్నారు దారి పొడవున రామభక్తులు అభినందిస్తూ ముందుకు సాగనంపారని మారుతి జోషి తెలిపారు ఆశ్రమాలలో బసచేస్తూ ముందుకు సాగినట్లు తెలిపారు కళ్ళకు గంతలతో వాహనం నడిపేందుకు నెలరోజులు సాధన చేశామని ఆ తర్వాత యాత్ర ప్రారంభించినట్లు తెలిపారు