Saturday, 2 March 2024

యాదగిరిగుట్ట సమాచారం

 దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాలైన యాదాద్రి భద్రాద్రి ఆలయాల పేర్లను త్వరలో మార్చనున్నట్లు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య వెల్లడించారు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రము యాదాద్రి కొండపై భక్తులు కొబ్బరికాయలు కొట్టే స్థలాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు కొండపైన కొబ్బరికాయలు కొట్టే స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి ఆలయ తూర్పు రాజగోపురం ఎదురుగా దర్శనం క్యూలైన్ సమీపంలో కొబ్బరికాయలు కొట్టేందుకు ఏర్పాటు చేశామని తెలిపారు శుక్రవారం స్వాతి నక్షత్రం పురస్కరించుకొని కొబ్బరికాయలు కొట్టే స్థలాన్ని ప్రారంభించామని అన్నారు యుద్ధ ప్రాతిపదికన కొండపైన కొబ్బరికాయలు కొట్టేందుకు స్థలంతో పాటు డార్మెంటరీ హాల్ అర్చకులకు అదనపు సౌకర్యాలతో పాటు భక్తులకు పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు యాదాద్రి ఆలయంతో పాటు భద్రాద్రి రామన్న ఆలయాన్ని పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేసి చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్ళవలసి ఉందని తెలిపారు యాదాద్రి అభివృద్ధికి సీఎం నిధులు కేటాయిస్తానని అన్నారని తెలిపారు మరో 15 రోజుల్లో యాదాద్రి ఆలయం పై మరోసారి రివ్యూ సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు ఆలయ అర్చకుల కోసం రెస్ట్ రూమ్ వాష్ రూమ్, నిర్మాణం చేయాలని అధికారులకు సూచించారు అంతకుముందు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయన వెంట ఆలయ అనువంశిక చైర్మన్ బి నరసింహమూర్తి ఈవో రామకృష్ణారావు మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధా గుండ్లపల్లి భరత్ కానుగు బాలరాజు గుండ్ల వరలక్ష్మి గుండ్లపల్లి నరసింహ బందారపు బిక్షపతి రాము కరణ్ తదితరులు ఉన్నారు



No comments:

Post a Comment