3, మార్చి 2024, ఆదివారం

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం

 భిక్కనూరు మండలంలోని పెద్ద మల్లారెడ్డి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు శనివారం గ్రామంలో గల హరిహర ఆలయ 65వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు కల్యాణాన్ని పురస్కరించుకొని శివపార్వతులను గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కళ్యాణం అనంతరం ఓడి బియ్యం పోసి మొక్కులు తీర్చుకున్నారు ఇట్టి కల్యాణాన్ని వాసవి క్లబ్ అధ్యక్షుడు సుదర్శన్ సభ్యుల సమక్షంలో నిర్వహించారు



అంగరంగ వైభవంగా అనంతుని రథోత్సవం

 నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్ గ్రామంలో గల శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని రథోత్సవం ఘనంగా నిర్వహించారు అనంతపద్మనాభస్వామి గోవిందా గోవిందా అంటూ భక్తుల రథాన్ని కొండపై నుండి కిందికి తాళ్లతో ఊరేగించారు కొండ కింది నుండి పైకి గోవిందా గోవిందా అంటూ నినాదాలతో రసాన్ని లాగే వేద పండితులు వేదమంత్రాలు చదివారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరై రథోత్సవంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అనంతని పట్టు వస్త్రాలు సమర్పించి ముక్కులు తీర్చుకున్నారు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అసెంబ్లీ కన్వీనర్ పద్మారెడ్డి గ్రామ మాజీ సర్పంచ్ శేఖర్ గౌడ్ సాయన్న గాయకులు కృష్ణ గ్రామ కమిటీ అధ్యక్షులు ఇసంపెల్లి గంగారం రామ్ రెడ్డి తదిత రులు పాల్గొన్నారు