Sunday, 3 March 2024

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం

 భిక్కనూరు మండలంలోని పెద్ద మల్లారెడ్డి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు శనివారం గ్రామంలో గల హరిహర ఆలయ 65వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు కల్యాణాన్ని పురస్కరించుకొని శివపార్వతులను గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కళ్యాణం అనంతరం ఓడి బియ్యం పోసి మొక్కులు తీర్చుకున్నారు ఇట్టి కల్యాణాన్ని వాసవి క్లబ్ అధ్యక్షుడు సుదర్శన్ సభ్యుల సమక్షంలో నిర్వహించారు



No comments:

Post a Comment