3, మార్చి 2024, ఆదివారం

అయోధ్యకు తరలిన బీర్పూర్ వాసులు

 బీర్కూరు మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 15 మంది భక్తులు అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడిని దర్శించుకునేందుకు ఆదివారం తరలి వెళ్లారు వీర్కూర్ రామాలయంలో మొదట ప్రత్యేక పూజలు చేశారు అనంతరం నిజామాబాద్కు వెళ్లారు అక్కడి నుంచి ప్రత్యేక రైలులో అయోధ్యకు తరలి వెళ్లారు



రాజరాజేశ్వర ఆలయంలో తాగునీటి వసతికి నాలుగు ట్యాంకుల విరాళం

 నవీపేట మండలంలోని నాగేశ్వర్ లోని రాజరాజేశ్వర ఆలయంలో తాగునీటి సౌకర్యార్థం గ్రామానికి చెందిన కోనేరు పెద్ద భీమిరెడ్డి నాలుగు తాగునీటి ట్యాంకులను విరాళంగా అందజేశారు రాబోయే మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ తాగునీటి ట్యాంకులు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బినోల సొసైటీ చైర్మన్ హనుమాన్లు తాజా మాజీ సర్పంచ్ సురేష్ నవీన్ సతీష్ తదితరులు ఉన్నారు