10, మార్చి 2024, ఆదివారం

20 నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

 తిరుమలలో శ్రీవారి సాలకట్ల తిప్పోత్సవాలు ఈనెల 20 నుంచి 24 వ తేదీ వరకు జరగనున్నాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరణీలో స్వామి అమ్మవార్లు విహరిస్తూ భక్తులను కనువిందు చేయనున్నారు తిప్పోత్సవాలలో తొలిరోజు శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమీపంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరణీయులు మూడు చెట్లు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు 21న రుక్మిణి సమేతంగా శ్రీ కృష్ణ స్వామి తిప్పలపై మూడుసార్లు విహరిస్తారు 22న శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి వారు మూడు సార్లు పుష్కరిణి చుట్టూ చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. ఇదే విధంగా శ్రీ మలయప్ప స్వామి వారు 23న 5 సార్లు చివరి రోజు మార్చి 24వ తేదీ 7 సార్లు తిప్పపై పుష్కరణలో విహరించి భక్తులను కటాక్షిస్తారు. కాగా తెప్పోత్సవాల కారణంగా ఈనెల 20 21 తేదీలలో సహస్ర దీపాలంకార సేవ ఈనెల 22 23 24 తేదీలలో ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది

మల్లన్న ఆలయంలో పెద్దపట్నం

 



సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి పెద్దపట్నం కళ్యాణం చేశారు శుక్రవారం అర్ధరాత్రి 12:30 గంటలకు మొదలై శనివారం తెల్లవారుజామున 4 గంటల వరకు కొనసాగింది స్వామి వారి పెద్దపట్నం చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక మహారాష్ట్ర కర్ణాటక నుంచి భక్తులు భారీగా హాజరయ్యారు ఆలయ ఒగ్గు పూజారులు పంచవన్ని రంగులతో నిలబయొక్క వరసల పట్నం వేసి స్వామివారికి యాదవ సంప్రదాయ కళ్యాణం జరిపించారు దర్బాలయం నుంచి వీరశైవ అర్చకులు ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి పెద్దపట్నం చుట్టూ ప్రదక్షిణలు చేసి పట్నం తొక్కడం ప్రారంభించారు అనంతరం భక్తులు మల్లన్నకు స్మరిస్తూ పట్నాన్ని విడతల వారీగా దాటారు