సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి పెద్దపట్నం కళ్యాణం చేశారు శుక్రవారం అర్ధరాత్రి 12:30 గంటలకు మొదలై శనివారం తెల్లవారుజామున 4 గంటల వరకు కొనసాగింది స్వామి వారి పెద్దపట్నం చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక మహారాష్ట్ర కర్ణాటక నుంచి భక్తులు భారీగా హాజరయ్యారు ఆలయ ఒగ్గు పూజారులు పంచవన్ని రంగులతో నిలబయొక్క వరసల పట్నం వేసి స్వామివారికి యాదవ సంప్రదాయ కళ్యాణం జరిపించారు దర్బాలయం నుంచి వీరశైవ అర్చకులు ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి పెద్దపట్నం చుట్టూ ప్రదక్షిణలు చేసి పట్నం తొక్కడం ప్రారంభించారు అనంతరం భక్తులు మల్లన్నకు స్మరిస్తూ పట్నాన్ని విడతల వారీగా దాటారు
No comments:
Post a Comment