ఎల్లారెడ్డి లోని అయ్యప్ప స్వామి ఆలయ ఎనిమిదవ వార్షికోత్సవాన్ని బుధవారం నిర్వహించనున్నట్లు ఆలయ పూజారి ముత్యాల శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు వసంత పంచమి పురస్కరించుకొని ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు ఉదయం 5 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ ఆరు నుంచి ఏడున్నర గంటల వరకు మూలవిరాటుకు పంచామృతం తదితర అభిషేకాలు 8:30 నుండి 11 గంటల వరకు గణపతి హోమం పుణ్యాహవాచనం నవగ్రహ పూజ కళాశాపన దీపారాధన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు 11:30 గంటలకు దివ్య పదిని టాంపటికి ప్రత్యేక పూజ మధ్యాహ్నం ఒంటిగంటకు భక్తులకు అన్నదానం సాయంత్రం 6 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తికి పల్లకి సేవ ఉంటాయని పేర్కొన్నారు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి