జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి ఆదివారం సాయంత్రం బ్రహ్మ పుష్కరిణి కోనేరులో తెప్పోత్సవాన్ని కనుల పండుగ జరిపించారు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఉత్సవమూర్తులను ఆలయం నుంచి బ్రహ్మ పుష్కరిణి వరకు మేళ తాళాల మధ్య తీసుకెళ్లారు కోనేరులో హంస వాహనంపై ఐదు ప్రదక్షిణలు చేయించారు అనంతరం భోగమండపంలోని ఊయలపై స్వామివారిలను ఆసీనులు చేసి డోలోత్సవం నిర్వహించారు రాష్ట్రం నలుమూలల నుంచి లక్ష మంది వరకు భక్తులు తరలివచ్చారు కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస్ ప్రభుత్వ విప్లరి లక్ష్మణ్ కుమార్ డిసీఎంఎస్ ఉమ్మడి జిల్లా చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు
No comments:
Post a Comment