జగిత్యాల జిల్లా ధర్మపురిలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం దక్షిణ దిగ్ యాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు సంప్రదాయం ప్రకారం ఆలయానికి దక్షిణ దిశలో ఉన్న పోలీస్ స్టేషన్ ఆవరణలో పూజలు నిర్వహించారు
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి మంగళవారం అక్కడి పోలీస్ స్టేషన్ను సందర్శించారు స్టేషన్లోని రికార్డులను పరిశీలించిన అనంతరం అక్కడ ప్రత్యేక పూజలు అందుకున్నారు స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముఖ్య ఘట్టమైన నరసింహుడి దక్షిణ దిగ్ యాత్రను మంగళవారం అంగరంగ వైభవంగా జరిపించారు ఇందులో భాగంగా ధర్మపురి పోలీస్స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ రామ్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై ఉదయ్ కుమార్ నేతృత్వంలో అర్చకుల వేద మంత్రచారణల మధ్య ప్రత్యేక పూజలు జరిపించారు ఆలయం నుంచి శోభాయాత్రగా తరలి వెళ్లిన స్వామివారికి పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రత్యేక పూజలు జరిపారు స్వామి వారి కళ్యాణ అనంతరం దక్షిణ ఉత్తరలుగా బయలుదేరుతుంటారని మార్గమధ్యంలో ఉన్న పోలీస్ స్టేషన్ను లక్ష్మీనరసింహుడు సందర్శించి రికార్డులు రిజిస్టర్లను పరిశీలించి దుష్టులను శిక్షిస్తాడని ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం అని పండితులు తెలిపారు
No comments:
Post a Comment