Tuesday, 5 March 2024

అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం

 లక్ష్మణ చాందా మండలంలోని బాబాపూర్ గ్రామంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం శివపార్వతుల కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి మహాశివరాత్రి ఐదు రోజుల ముందు స్వామివారి కల్యాణ వేడుకలు నిర్వహించి నిత్య పూజలు నిర్వహిస్తారు. పేద మంత్రోచ్ఛారణల మధ్య ముత్తైదువల మహిళల నడుమ శివపార్వతుల కల్యాణ వేడుకలు వైభవంగా జరిగాయి ఆలయం లోపల జరుగుతున్న స్వామివారి కల్యాణ వేడుకలు బయట ఉన్న భక్తులందరూ తిలకించేందుకు ఆలయ ఆవరణలో ఎల్ఈడి వాల్ స్క్రీన్ ఏర్పాటు చేసి స్వామివారి కల్యాణ వేడుకలను వీక్షించారp అనంతరం రథ గుడి వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి రథోత్సవాన్ని బయటకు తీశారు ఈ వేడుకలను వీక్షించేందుకు బాబాపూర్ నర్సాపూర్ కనకాపూర్ వడ్యాల్ కన్జర్ బోరిగం రాజాపూర్ తదితర గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణ వేడుకలను వీక్షించి స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా భారీ భక్తజనం హాజరయ్యారు ఈనెల 8వ తేదీన శివరాత్రి వేడుకలు మూడు రోజులపాటు జాగారం సాగనుంది





No comments:

Post a Comment